ఐపీఎల్ 15వ సీజన్ మరికొన్ని రోజుల్లో ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్, యార్కర్ కింగ్ లసిత్ మలింగను తమ జట్టుకు ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా నియమించుకుంది. ఈ మేరకు RR ట్వీట్ చేసింది. ఇది వరకు ముంబయి ఇండియన్స్ తరపున ఆడిన మలింగ 122 మ్యాచ్ లలో 170 వికెట్లతో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. అలాంటి బౌలర్ ను తమ కోచ్ గా నియమించుకొని రాజస్థాన్ తమ జట్టుకు మరింత బలాన్ని చేకూర్చుకుంది. అయితే, బౌలింగ్ కోచ్ గా మలింగ్ ను తీసుకోవడంలో రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ కుమార సంగక్కర చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. మరి, వచ్చే సీజన్ లో రాయల్స్ బౌలర్లు కొత్త కోచ్ ఆధ్వర్యంలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.