గతేడాది విడుదలైన టాప్ 10 చిత్రాలను ఓర్మాక్స్ మీడియా ప్రకటించింది. తెలుగు ప్రేక్షకులను మెప్పించిన పది చిత్రాలను ఓర్మాక్స్ వెల్లడించింది. వాటిలో ‘కేజీఎఫ్ 2’, ‘ఆర్ఆర్ఆర్’, ‘విక్రమ్’, ‘సీతారామం’, ‘మేజర్’, ‘కార్తికేయ 2’, ‘లవ్ టుడే’, ‘హిట్ 2’, ‘ధమాకా’, ‘బింబిసార’ చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాలను తెలుగు ప్రేక్షకులు భీభత్సంగా చూసినట్లు ఓర్మాక్స్ మీడియా పేర్కొంది. థియేటర్లలో విడుదలైన సినిమాలను మాత్రమే ఓర్మాక్స్ ప్రకటించింది. ఓటీటీలో విడుదలైన మూవీలను పరిగణనలోకి తీసుకోలేదు.