TS: ‘ఎమ్మెల్యేల ఎర’ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కేరళ బీడీజేఎస్ అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ విచారణపై స్టే విధించాలని పిటిషనర్ కోరారు. అంతేగాకుండా, ఈ పిటిషన్లో సీఎం కేసీఆర్‌ని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. కేసీఆర్ రాజకీయ అజెండా మేరకే సిట్ దర్యాప్తు జరుగుతోందని ఆరోపించారు. ఈ కేసులో తుషార్‌కు సిట్ 16న నోటీసులు జారీ చేసింది. 21న విచారణకు రావాలని అందులో తెలిపింది. దీనిపై స్పందిస్తూ.. ‘అనారోగ్యం వల్ల 2వారాల గడువు కోరుతూ మెయిల్ చేశా. అయినా రిప్లై ఇవ్వకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు’ అంటూ పిటిషన్లో పేర్కొన్నారు.
సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో వ్యాజ్యం

© File Photo