టిక్ టాక్ నుంచి వినియోగదారుల సమాచారాన్ని ట్రాక్ చేయొచ్చని మాతృసంస్థ బైట్ డ్యాన్స్ అంగీకరించినట్లు తెలిసింది. కంపెనీలోని కొందరు ఉద్యోగులు జర్నలిస్టుల సమాచారాన్ని యాక్సెస్ చేశారని పేర్కొన్నట్లు సమాచారం. టిక్ టాక్ నుంచి సమాచారం లీక్ అయిన సమయంలో దర్యాప్తు చేపట్టగా ఈ విషయం వెల్లడైందని తెలిపింది. జర్నలిస్టుల ఐపీ అడ్రస్ ఆధారంగా వారి లొకేషన్ని ట్రాక్ చేయడానికి ప్రయత్నించారట. దీంతో వారిని కంపెనీ నుంచి బైట్‌డ్యాన్స్ తొలగించినట్లు తెలిసింది. వినియోగదారుల గోప్యతను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని సంస్థ పేర్కొంది.