తమిళ్ స్టార్ హీరో విజయ్, క్రేజీ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌ల కాంబినేషన్‌లో వస్తోన్న ‘లియో’ మూవీ కశ్మీర్ షెడ్యూల్ ముగిసింది. కశ్మీర్ నుంచి డైరెక్ట్‌గా చెన్నై చేరుకుంది చిత్రబృందం. కశ్మీర్‌లో ఎలాంటి హడావుడి లేకుండా డైరెక్టర్ లోకేశ్ షూటింగ్ ముగించేశాడు. ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కశ్మీర్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. 90 రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేయాలని మూవీ మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.