మనం రోడ్డు మీద ఏదో ఆలోచించుకుంటూ వెళ్తుంటే ఎవరైనా గట్టిగా అరిస్తేనే గజ్జుమని వణుకుతాం. అటువంటిది ఓ చిరుతపులి దాడి చేస్తే.. ఊహించుకుంటేనే భయం వేసే ఈ ఘటన నిజంగానే జరిగింది. అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో ఓ స్లైక్లిస్టు వెళ్తుండగా.. పక్కనే ఉన్న అడవిలోంచి ఓ చిరుత వచ్చి దాడి చేసింది. కానీ ఈ దాడిలో ఆ సైక్లిస్టుకు ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో ఆ సైక్లిస్టు వెంటనే తేరుకుని అక్కడి నుంచి వచ్చిన దారిలోనే పరుగో.. పరుగు అనుకుంటూ వెళ్లిపోయాడు. ఓ ఐఎఫ్ఎస్ అధికారి షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.