హర్యానా రాష్ట్రం పానిపట్‌లోని బెహ్రంపూర్ గ్రామంలో పోలీసులపై చిరుతపులి దాడిచేసింది. ఈ భయంకరమైన ఘటనను పానిపట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శశాంక్ కుమార్ సావన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. అయితే ఈ దాడిలో పోలీసులతో పాటు కొందరు అటవీ అధికారులకు గాయలయ్యాయి. కానీ చిరుత దాడిచేస్తున్నప్పటికీ చెక్కుచెదరని వారి ధైర్యానికి మెచ్చుకోవాలి అని పేర్కొన్నారు. చివరికి చిరుతపులితో పాటు అందరూ క్షేమంగా బయటపడినట్లు వెల్లడించారు.