ఓ రైలు ఇంజిన్‌పై చిరుత కళేబరం కలకలం రేపింది. మహరాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా వనీ బొగ్గు గని క్షేత్రంలో నిలిచి ఉన్న రైలు ఇంజిన్‌పై చిరుత పులి కళేబరం కనిపించింది. సీటీపీఎస్‌కు బొగ్గును తరలించేందుకు రైలు అప్పుడే వచ్చి ఆగింది. స్థానిక రైల్వే ఉద్యోగులు గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా సీటీబీపీఎస్ తాడోబా ప్రాంతంలో రైలు వచ్చే క్రమంలో చిరుత ఇంజిన్‌పై నుంచి దూకబోయి హైటెన్షన్ విద్యుత్ తీగలకు తగిలి చనిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.