వైకాపా భూస్వాముల కోటలను బద్ధలు కొడతామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామని సవాల్ విసిరారు. తమ పార్టీ ఆవిర్భావ సభకు ఇప్పటంలో భూములు ఇచ్చిన వారి ఇళ్లు కూల్చి వేశారని..అలాంటి వైకాపా గడపను కూల్చేదాకా నిద్రపోనని హెచ్చరించారు. పిచ్చిపిచ్చిగా వాగిన ప్రతి ఒక్కరికీ తాము అధికారంలోకి వచ్చాక బాధ్యత గుర్తు చేస్తామన్నారు. వైకాపాను దెబ్బకొట్టాలంటే భాజపా పెద్దలకు, ప్రధానికి చెప్పనని..తానే తేల్చుకుంటానని వ్యాఖ్యానించారు.