ఖమ్మం సభ దేశంలో మార్పునకు సంకేతమని BRS అధినేత KCR అన్నారు. TRSను BRSగా మార్చిన తర్వాత తొలిసారి ఖమ్మంలో నిర్వహించిన సభకు భారీగా జనం హాజరయ్యారు. అన్ని విధాలా సుసంపన్నమైన దేశంలో బకెట్ నీటి కోసం అర్రులు చాచే పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒకరినొకరు నిందించుకోవడం తప్ప దేశానికి చేసిందేం లేదన్నారు. BRS అధికారంలోకి వస్తే రెండేళ్లలో వెలుగు జిలుగుల భారత్‌ను తయారు చేస్తామన్నారు. రైతులందరికీ ఉచిత కరెంట్ ఇస్తామని, రైతుబంధు దేశమంతా అమలుచేయడమే తమ విధానమని స్పష్టం చేశారు. దేశంలో చైతన్యం తెచ్చేందుకు BRS పుట్టిందన్నారు. త్వరలోనే BRS విధానం, వ్యూహం తెలియజేస్తామని KCR ప్రకటించారు.