ఓ వ్యక్తి ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించిందని సరికొత్తగా లెటర్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ లేఖలో తాను అమ్మాయిని ప్రేమించిన 9 ఏళ్ల కాలంలో చేసిన ఖర్చులు రూ.4.50 లక్షలు తిరిగి తన ఫ్యామిలికి ఇప్పించాలని లేఖలో కోరాడు. కర్ణాటకలోని చిక్ మంగళూరుకు చెందిన చేతన్ అనే వ్యక్తి ఓ వాహనం నడుపుతు సాధారణ జీవితం గడిపేవాడు. అయితే అతను 9 ఏళ్లుగా ఓ అమ్మయిని ప్రేమించగా, పెళ్లి అనే సరికి ఆమె హ్యాండ్ ఇచ్చింది. దీంతో ఆవేదన చెందిన చేతన్ సూసైడ్ చేసుకున్నాడు. ఈ క్రమంలో తన సరదాల కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని లెక్క రాశాడు. ప్రియురాలి నుంచి ఆ మొత్తాన్ని తన కుటుంబానికి తిరిగి ఇప్పించాలని కోరుతూ లేఖలో పేర్కొని ప్రాణాలు కోల్పాయాడు.