చైనా కొత్త ప్రధానిగా లీ చియాంగ్ ఎన్నికయ్యారు. ఆయన అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అత్యంత విశ్వసనీయుడు. శనివారం జరిగిన ఎన్నికలో చైనా పార్లమెంట్ లీ చియాంగ్ ఎన్నికను ఆమోదించింది. సభకు హాజరైన 2947మందిలో 2936మంది ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు.2012లో లీ చియాంగ్ చైనా అధ్యక్ష ఎన్నికల్లో జిన్‌పింగ్‌తో పోటీపడ్డారు.