పరేడ్ గ్రౌండ్‌లోనే విమోచన వేడుకలు: కిషన్ రెడ్డి

© ANI Photo

తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలను కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు మరోసారి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్‌లో విమోచన దినోత్సవం వేడుకలు నిర్వహిస్తున్నాం. ఈ వేడుకలకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ సీఎంలను ఆహ్వానిస్తున్నాం. 1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్ర్యం వస్తే తెలంగాణకు రాలేదు. తెలంగాణ నిజాం పాలనలో ఉంది. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు పోలీస్ యాక్షన్ చర్య ద్వారా విమోచనం లభించింది. ఆ రోజును స్మరించుకుంటూ వేడుకలు చేస్తున్నాం’ అని వివరించారు.

Exit mobile version