ప్రభుత్వ రంగ భీమా సంస్థ LIC(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా) ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో చోటు సంపాదించింది. ఇటీవలే IPOలో లిస్ట్ చేయబడిన ఈ సంస్థ 97.26 బిలియన్ డాలర్ల ఆదాయం, 553.8 మిలియన్ డాలర్ల లాభంతో ఈ జాబితాలో 98వ స్థానంలో నిలిచింది. అటు ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 51 స్థానాలు ఎగబాకి 104వ స్థానానికి చేరుకుంది. ఈ లిస్ట్‌లో వాల్‌మార్ట్ అగ్ర స్థానంలో ఉంది. ఇండియాకు చెందిన తొమ్మిది కంపెనీలు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి.