ఎల్ఐసీ ఐపీఓ కోసం అనుమతి కోరుతూ ఫిబ్రవరి 13న సమర్పించిన ముసాయిదా పత్రాలకు సెబీ గతవారంలోనే ఆమోదం తెలిపింది. దీంతో ఐపీఓ ప్రకటించేందుకు మే 12 వరకు గడవు ఉంది. అది దాటితే మళ్లీ అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో ఐపీఓ ప్రకటించాలా వద్దా అనే సందిగ్ధంలో ఉంది ప్రభుత్వం. మొదట దీనిపై మదుపర్లు ఆసక్తి చూపినప్పటికీ ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు ఉక్రెయిన్-రష్యా యుద్ధ నేపథ్యంలో తీవ్ర నష్టాలతో కొనసాగుతున్నాయి. అయితే అప్పటివరకు మార్కెట్ మళ్లీ గాడినపడితే తప్ప ఈ ఆర్థిక సంవత్సరంలో ఐపీఓ ప్రకటించేందుకు ప్రభుత్వం సముఖంగా లేనట్లు తెలుస్తోంది.