LIC(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సంస్థలో చాలా మంది పాలసీలు చేసి ఉంటారు. కానీ కొంత మంది అనేక ఆర్థిక కారణాల వలన సరైన సమయంలో పాలసీలు రెన్యూవల్ చేయలేకపోతారు. అటువంటి వారి పాలసీలు ల్యాప్స్ అయిపోతుంటాయి. అలా ల్యాప్స్ అయిపోయిన పాలసీలను మార్చి 25లోపు పునరుద్ధరించుకోవచ్చునని LIC తెలియజేసింది. రూ. ఒక లక్ష వరకు ప్రీమియం చెల్లించినట్లయితే వారికి 20శాతం, రూ. 3 లక్షల వరకు ప్రీమియం చెల్లించినట్లయితే 25 శాతం, రూ. 3 లక్షలకు మించి ప్రీమియం చెల్లించినట్లయితే 30 శాతం రాయితీని LIC అందజేస్తోంది. ఈ రాయితీ ఆఫర్ మార్చి 25 వరకు ఉండనుంది.