సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదల తేదీ ప్రకటన అనంతరం సోషల్ మీడియాలో అభిమానులతో కాసేపు ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు చేసిన ట్వీట్లకు సామ్ సరదాగా బదులిచ్చింది. ‘ఇప్పుడు మీ జీవితం ఎలా సాగుతోంది?’ అని ఓ నెటిజన్ అడగ్గా.. ‘విభిన్నంగా సాగుతోంది’ అంటూ బదులిచ్చింది. ‘శాకుంతలం సినిమాను 3డీలో విడుదల చేయడానికి కారణమేంటి?’ అని మరో నెటిజన్ ప్రశ్నించగా.. ‘మీరే చూస్తారుగా’ అంటూ రిప్లై ఇచ్చింది. అభిమానుల ప్రేమ, ఆప్యాయతల వల్లే ఇలా ధృడంగా ఉండగలుగుతున్నానని సామ్ ఈ సందర్భంగా అభిప్రాయపడింది.