• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జీవో 111ను ఎత్తేస్తారా ? సడలిస్తారా ? ఆసక్తిగా ప్రభుత్వ నిర్ణయం

    హైదరాబాద్ నగర ప్రజలక దాహార్తిని ఎన్నో ఏళ్లుగా తీరుస్తున్న జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్. అయితే ఈ జంట జలాశయాల పరిరక్షణకు 1996లో జీవో 111ను తెచ్చారు. ఈ జీవో ప్రకారం ఈ జలాశయాల పరిధిలో 10 కిలోమీటర్ల మేర ఎలాంటి పరిశ్రమలు ఉండకూడదు. అయితే ఇప్పుడు ఈ జీవోను రద్దు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. వీటి పని పూర్తయ్యిందని, హైదరాబాద్ వాసులకు ఇప్పుడు గోదావరి నీళ్లు వస్తాయని అందుకే వీటిని పరిరక్షించే అవసరం లేదన్నారు. దీనిపై పెద్ద వివాదం చెలరేగే అవకాశం ఉన్నది. గతంలో ఈ జీవోను రద్దు చేద్దామని ప్రయత్నించినా న్యాయస్థానం ఒప్పుకోలేదు. పైగా ఈ జీవోకు సంబంధించిన కేసు 15ఏళ్లుగా నడుస్తూనే ఉంది. దీంతో ఈ జీవోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.