‘లైగ‌ర్‌’కు భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్‌

విజ‌య్ దేవ‌ర‌కొండ ‘లైగ‌ర్’ సినిమాకు ప్రీ-రిలీజ్ బిజినెస్ భారీగా జ‌రుగుతుంది. లైగ‌ర్ తెలుగు థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను వ‌రంగ‌ల్ శ్రీను రూ.72 కోట్ల‌కు కొనుగోలు చేశాడు. విజ‌య్ సినిమాల‌న్నింటిలో ఇదే అత్య‌ధికం. వ‌రంగ‌ల్ శ్రీనుకు ఈ సినిమా విజ‌యం చాలా కీల‌కం. ఎందుకంటే విరాట‌ప‌ర్వం, ఆచార్య సినిమాల‌ను తీసుకొని న‌ష్టపోయాడు. లైగ‌ర్ విజ‌యంతో ఆ న‌ష్టాల‌ను పూడ్చుకోవ‌చ్చ‌నే ఉద్దేశంతో భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన‌ట్లు తెలుస్తుంది. ఓవ‌ర్సీస్‌లో కూడా సినిమాకు డిమాండ్ చాలా ఎక్కువ‌గానే ఉంది.

Exit mobile version