పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన పాన్ఇండియా మూవీ ‘లైగర్’. ఈ చిత్రంపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఓవర్సీస్‌లో అన్ని భాషల్లో కలిపి లైగర్ రైట్స్ రూ.8 కోట్లకు అమ్ముడయ్యాయి. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఆగస్ట్ 25న విడుదలకు సిద్ధంగా ఉంది. అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. టీజర్, ట్రైలర్, ప్రమోషన్లతో చిత్రబృందం ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.