మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్‌ఫాదర్’ మూవీలో ఒక సాంగ్ ఇటీవల షూట్ చేశారు. సల్మాన్ ఖాన్, మెగాస్టార్ ఇద్దరు కలిసి ఈ పాటకు స్టెప్పులేశారు. ప్రముఖ కొరియోగ్రఫర్ ప్రభుదేవా ఆద్వర్యంలో ఈ పాట చిత్రీకరణ పూర్తయింది. అయితే ముంబయిలో జరిగిన ఈ షూటింగ్‌లో ‘లైగర్’ చిత్రబృందం సందడి చేసింది. విజయ్ దేవరకొండ, చార్మీ, పూరీ జగన్నాథ్ చిరంజీవి, సల్మాన్ ఖాన్‌తో దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. లైగర్ మూవీ ఆగస్ట్ 25న రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రబృందం ముంబయి నుంచి ప్రమోషన్స్ ప్రారంభించింది.