బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మంగళవారానికి బలహీనపడింది. రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలహీనపడే అవకాశముంది వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఉపరితల ఆవర్తనం కారణంగా బుధ, గురు వారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొది. తెలంగాణలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు
