అసని తుఫాన్ ప్రభావం హైదరాబాద్‌పై పడింది. దీంతో ఉదయం 4 నుంచి నగరవ్యాప్తంగా చిరుజల్లులు కురుస్తున్నాయి. వాతావరణం చల్లబడటంతో నగరవాసులు ఉపశమనం పొందుతున్నారు. అలాగే నేడు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, ములుగు, మంచిర్యాల తదితర జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. తుఫాన్ కారణంగా విశాఖ నుంచి నడిచే పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి.