టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చిన్నప్పుడు బ్యాట్స్మెన్ అవ్వాలనుకున్నానని.. తర్వాత కపిల్ దేవ్లా కావాలనే ఉద్దేశంతో మీడియం పేస్ ప్రయత్నించానని పేర్కొన్నాడు. శ్రీలంకతో జరిగిన టెస్టులో కపిల్ రికార్డు(434 వికెట్లు)ను అధిగమించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. కపిల్లా అవ్వాలనుకున్న.. కాని అతడి రికార్డునే బద్ధలుకొడతానని అనుకోలేదని ఆనందం వ్యక్తం చేశాడు.