తాను ఒత్తిడిలో ఆడేందుకు ఇష్టపడుతానని టీమిండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించాడు. కపిల్‌దేవ్‌తో తనను పోల్చడంపై అశ్విన్ స్పందించాడు. కపిల్ దేవ్ ప్రపంచం గుర్తించిన ఆటగాడు అంటూ అశ్విన్ కితాబిచ్చాడు. అయితే, ఏ పని ఎంచుకున్నా అందులో ఉత్తమ ప్రదర్శన ఇవ్వడం చాలా ముఖ్యమని అశ్విన్ వెల్లడించాడు. ప్రతి మ్యాచుని తాను గొప్పగానే భావిస్తానని.. ఒత్తిడిని ఆస్వాదిస్తానని ఆఫ్ స్పిన్నర్ తెలిపాడు. ఒత్తిడిలో ఆడేందుకు ఎదురు చూస్తానని అశ్విన్ చెప్పాడు. టెస్టుల్లో అశ్విన్ 449 వికెట్లు తీసుకుని కపిల్ దేవ్ రికార్డు(434)ని బ్రేక్ చేశాడు. కానీ, పరుగుల విషయంలో వెనకబడ్డాడు.