హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (HRDCL) ద్వారా నగరంలోని ఐటి కారిడార్లలో ట్రాఫిక్‌ను సులభతరం చేసే లక్ష్యంతో లింక్ రోడ్ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), హెచ్ఆర్డిసిఎల్ అధికారులతో సమీక్షించిన తర్వాత మొత్తం 126.20 కి.మీ పొడవుతో 135 లింక్ రోడ్లను ఖరారు చేసింది. వివిధ దశల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. మొదటి రెండు దశల్లో చేపట్టిన పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అదే విధంగా, మొదటి దశలో 44.7 కి.మీ మేర 37 రీచ్‌లను రూ.313.65 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టగా, అందులో 16 పనులు పూర్తయ్యాయి.