టీమిండియాతో వన్డే సిరీస్ కు లిటన్ దాస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. బంగ్లా కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో లిటన్ ను నియమిస్తున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. లిటన్ అద్భుతమైన ఆటగాడని…కెప్టెన్సీ చేయగలిగే సత్తా అతడిలో ఉందని వెల్లడించింది. సిరీస్ కు తమీమ్ దూరం కావటం చాలా దురదృష్టకరమన్నారు. లిటన్ దాస్ కు కెప్టెన్సీ అనుభవం లేదు. ఒకే ఒక్క టీ ట్వంటీ మ్యాచ్ కు సారథ్యం వహించాడు.