రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతుండగా.. రష్యా అధికారిక టీవీ చానల్ లైవ్‌ను కట్ చేసింది. మాస్కోలోని ప్రధాన పుట్ బాట్ స్టేడియంలో పుతిన్ ప్రసంగిస్తున్న సమయంలో లైవ్ కట్ అయింది. అసలు ఇలా ఎందుకు జరిగిందో విచారణ చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. పది నిమిషాల్లో లైవ్‌ను తిరిగి పునరుద్ధరించారు. పుతిన్ ప్రసంగం అయిపోయే వరకు లైవ్‌ను కంటిన్యూ చేశారు. సాంకేతిక కారణాల వల్లే ఇలా జరిగిందని క్రెమ్లిన్ నుంచి అధికారిక ప్రకటన విడుదలయింది. పుతిన్ ప్రసంగం కట్ అయిన సమయంలో టీవీలో రష్యా దేశభక్తి గీతం టెలికాస్ట్ అయింది.