చైనాలోని షాంఘై నగరంలో కరోనా విజృంభణ మళ్లీ కొనసాగుతుంది. దీంతో అధికారులు కట్టడి దిశగా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 2.6 కోట్ల మంది నివసిస్తున్న ఈ నగరంలో విడతల వారీగా ఆంక్షలు విధించనున్నట్లు వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనే ఉద్దేశంతో అసలు లాక్డౌన్ విధించమని అధికారులు ఇటీవలే పేర్కొన్నారు. కాని ఒక్కసారిగా కేసులు తీవ్రంగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.