ప్రపంచ వాణిజ్య కేంద్రమైన చైనా నగరం షాంఘైలో రెండు నెలల లాక్డౌన్ తర్వాత బుధవారం నుంచి ఆంక్షలు సడలించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి దాదాపు 25 మిలియన్ల జనాభా నగరంలో స్వేచ్ఛగా తిరిగేందుకు ఆంక్షలు ఎత్తివేశారు. మరోవైపు కొన్ని నిబంధనల నడుమ ప్రజలు ప్రయాణం, షాపింగ్ చేయవచ్చని అక్కడి అధికారులు ప్రకటించారు. బ్యాంకులు, మాల్స్ వెళ్లేవారు 72 గంటలు చెల్లుబాటు అయ్యే పీసీఆర్ సర్టిఫికేట్ చూపించాలనే రూల్ కూడా అమలు చేస్తున్నారు.