ట్విటర్ సేవల్లో కొందరికి అంతరాయం కలిగింది. ఉదయం 3 గం. నుంచి 7 గం. మధ్య వినియోగదారులు కొందరు లాగిన్ కాలేకపోయారు. లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించగా ఎర్రర్ చూపించినట్లు ఫిర్యాదులు చేశారు. మరోవైపు ట్విటర్ ఉద్యోగులకు ఎలాన్ మస్క్ షాక్ ఇచ్చారు. వారికి మెయిల్స్ పంపించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు సగం మంది సిబ్బందిని తొలగించేందుకు మస్క్ సిద్ధమయ్యారని సమాచారం. ఇందులో 7500 మంది ఉన్నారని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.
ట్విటర్లో లాగిన్ సమస్యలు

© Envato