‘లాలిప‌ప్’ మ్యూజిక్ వీడియో రిలీజ్

Courtesy Instagram: Sudhakar Komakula

ఈ మధ్యకాలంలో యూట్యూబ్‌లో మ్యూజిక్ వీడియోల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొని దాన్ని సాంగ్ రూపంలో ప్రెజెంట్ చేయ‌డం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. తాజాగా విన‌య్ ష‌ణ్ముఖ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘లాలిప‌ప్’ అనే మ‌రో మ్యూజిక్ వీడియో రిలీజైంది. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు దీన్ని లాంచ్ చేయ‌డం విశేషం. ఈ పాట‌లో 30 వెడ్స్ 21 ఫేమ్ అన‌న్య‌, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాక‌ర్ కోమాకుల న‌టించారు. స్కూల్‌లో ఉన్న‌ప్పుడు అమ్మాయి అబ్బాయిని ఇష్ట‌ప‌డితే.. పెద్ద‌య్యాక అబ్బాయి, అమ్మాయి వెంట ప‌డ‌తుంటాడు. ఈ పాట‌ను సిధ్ శ్రీరామ్ పాడ‌టం మ‌రో హైలెట్, విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందించాడు. ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది.
LOLLIPOP Music Video  | SidSriram | Sudhakar | Ananya | VinayShanmukh | Vijai Bulganin | S krishna

Exit mobile version