చావు కబురు చల్లగా మూవీ చుశారా. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి చనిపోయిన సమయంలో హీరోకు ప్రేమ పుడుతుంది. నటి లావణ్య త్రిపాఠి ఏడుస్తున్న క్రమంలో హీరో కార్తీక్ చూసి ఫ్లాట్ అయి లవ్ ప్రపోజ్ చేస్తాడు. సేమ్ సీన్ నిజ జీవితంలో కూడా రిపీట్ అయ్యింది. అమెరికా కాలిఫోర్నియా గార్డెనాలోని సిటీ ఆఫ్ రెఫ్యూజ్ చర్చిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తండ్రి అంత్యక్రియలు పూర్తైన తర్వాత పాస్టర్ నోయెల్ జోన్స్ ఆ మహిళకు తన ప్రేమను వక్తపరుస్తాడు. మెకాళ్లపై కూర్చుని నన్ను పెళ్లిచేసుకుంటావా అని అడిగి తన వేలికి ఉంగరం తొడుగుతాడు. దీంతో అక్కడున్న పలువురు ఆశ్చర్యానికి గురికాగా, మరికొందరు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్న ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.