• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రభాస్‌తో ప్రేమ..! వరుణ్‌ మాటలకు బాధపడ్డా: కృతిసనన్‌

    పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో తాను ప్రేమలో ఉన్నట్లు నటుడు వరుణ్‌ధావన్‌ చేసిన వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధపెట్టాయని నటి కృతిసనన్‌ అన్నారు. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఆమె ‘ప్రభాస్‌తో నేను ప్రేమలో ఉన్నానంటూ వరుణ్‌ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు నన్ను ఎంతో ఇబ్బందిపెట్టాయి. ఆ క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రభాస్‌తో ఫోన్‌లో మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని పంచుకున్నాను. ఆయన వెంటనే.. ‘వరుణ్‌ ఎందుకు అలా చెప్పాడు?’ అని ప్రశ్నించాడు. పిచ్చితనంతో అలా అన్నాడని బదులిచ్చాను’ అని వివరించింది.