కులాలు వేరైనా ప్రేమతో కలిశారు. పెద్దలకు చెప్పినా ఒప్పుకోరని పెళ్లితో ఒక్కటయ్యారు. కానీ పెళ్లికి ముందున్న ప్రేమ ఆ తర్వాత అనుమానంగా మారింది. భార్య ఎవరితో మాట్లాడినా వేధించడం, ఫోన్‌కు లాక్ పెట్టడం వంటివి చేస్తూ చిత్రహింసలకు గురిచేశాడు. మానసిక వేధన భరించలేని యువతి చివరికి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్ మల్కాజ్‌రిగి పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీనాథ్ వేధింపులు భరించలేక, 24 ఏళ్ల భవాని బలవన్మరణానికి పాల్పడింది.