గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 62 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 144 పరుగులు చేయడంతో లక్నో అలవోక విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ గుజరాత్ బౌలర్లు సత్తా చాటి లక్నో బ్యాటర్లను బెంబేలెత్తించారు. దీంతో లక్నో జట్టు కేవలం 82 పరుగులకే చాప చుట్టేసింది. లక్నో ఇన్నింగ్స్ లో 27 పరుగులు చేసిన దీపక్ హుడానే టాప్ స్కోరర్ గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4, సాయి కిషోర్, యశ్ దయాల్ చెరి 2, షమీ ఒక వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది.