కేకేఆర్ తో జరిగిన మ్యాచులో లక్నో జట్టు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్లో కేకేఆర్ విజయం కోసం 21 పరుగులు అవసరం కాగా మొదటి నాలుగు బంతుల్లో రింకూ సింగ్ (15 బంతుల్లో 40) 18 పరుగులు రాబట్టాడు. ఇక కేకేఆర్ గెలుపు ఖాయం అని అనుకున్న తరుణంలో బౌలర్ స్టాయినిస్ తన మార్కును చూపెట్టాడు. చివరి రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి లక్నోకు చిరస్మరణీయ విజయం అందించాడు. లక్నో బౌలర్లలో మొహ్‌సిన్ ఖాన్, స్టాయినిస్ చెరి 3, గౌతమ్, రవి భిష్ణోయ్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ ఓటమితో కేకేఆర్ ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి.