గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రేపటి నుంచి రూ.5కే భోజనం అందించనున్నారు. మొదటి దశలో భాగంగా నిలోఫర్, ఉస్మానియా, గాంధీ, సరోజిని దేవీ, మెటర్నిటీ, ఎంఎన్‌జే క్యాన్సర్, ఫీవర్, ఈఎన్‌టీ, చెస్ట్ ఆసుపత్రుల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మరో 9 టీ మినీ డయాగ్నోస్టిక్ కేంద్రాలు బుధవారం ప్రారంభంకానున్నాయి.