నితిన్ హీరోగా నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రీకరణ పూర్తికావొస్తుంది. ఒక పాట మినహాయించి షూటింగ్ మొత్తం పూర్తయినట్లు చిత్రబృందం వెల్లడించింది. అనుకున్న సమయానికే ఆగస్ట్ 12న మూవీ థియేటర్లలోకి వస్తుందని చెప్పింది. ఈ సినిమాలో కృతి శెట్టి, క్యాథరిన్ హీరోయిన్లుగా నటించనున్నారు. రాజశేఖర్ రెడ్డి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ దీన్ని నిర్మిస్తుంది.