అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెంజీ స్కాట్ భారీ విరాళం ప్రకటించారు. అమెరికాలోని బాయ్స్ & గర్ల్స్ క్లబ్‌లకు 281 మిలియన్ డాలర్ల (రూ.2వేల కోట్లు) విరాళం అందించినట్లు పేర్కొన్నారు. స్కాట్ ఇప్పటివరకు ఇచ్చిన అతిపెద్ద పబ్లిక్ బహుమతి ఇదేనని పలువురు అంటున్నారు.హోమ్‌వర్క్, కళలు, నాయకత్వం, మార్గదర్శకత్వం, వినోదం, క్రీడలు సహా.. పలు అంశాలపై దృష్టి సారించే యువకుల కోసం ఈ క్లబ్‌లు కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ఆ బహుమతిని 62 స్థానిక క్లబ్‌లలో వివిధ మొత్తాలుగా విభజించబడతాయని బాయ్స్ & గర్ల్స్ క్లబ్స్ ఆఫ్ అమెరికా ప్రతినిధి తెలిపారు.