‘కాంగ్రెస్ పార్టీపై బీజేపీ, టీఆర్ఎస్ కలిసి కుట్రలు’

screen shot

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని TRS, BJPలు భయపడుతున్నాయని కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీపై బీజేపీ, టీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఢీల్లీ వెళ్లిన తర్వాతే రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదించినట్లు గుర్తు చేశారు. బీజేపీ కుట్రలకు టీఆర్ఎస్ సహకరిస్తుందన్నారు. గాంధీభవన్లో గురువారం నిర్వహించిన సమావేశంలో మధుయాష్కీ ఈ విధంగా పేర్కొన్నారు.

Exit mobile version