• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ చూసేందుకు మధ్యప్రదేశ్ పోలీసులకు సెలవు

    ఇటీవల విడుదలైన “ది కాశ్మీర్ ఫైల్స్” చిత్రాన్ని చూడటానికి పోలీసులకు సెలవు మంజూరు చేస్తున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ప్రకటించారు. ఆ రాష్ట్రంలో ఏ పోలీసు అయినా తమ కుటుంబంతో కలిసి ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చూడటానికి వెళ్లాలనుకున్నప్పుడు సెలవు మంజూరు చేస్తామని తెలిపారు. మరోవైపు ఈ సినిమాకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వినోదపు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. 1990లో కశ్మీరి పండిట్ల ఊచకోత నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించగా, వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు.