మధ్యప్రదేశ్‌కు చెందిన ఎంపీ అరవింద్ సింగ్ బడోరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వర్గానికి చెందిన వారు గిరిజన మహిళలను వివాహం చేసుకొని వారి భూములు ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. అనంతరం అమ్మాయిలను హింసిస్తున్నారని పేర్కొన్నారు. నలుగురిని పెళ్లి చేసుకునే హక్కు వారికి ఎవరు కల్పించారని ప్రశ్నించారు. యూసీసీ నిబంధనలను దేశవ్యాప్తంగా కచ్చితంగా అమలు చేయాలని..గిరిజనులపై అరాచకాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.