దుబాయ్‌లోని ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ స్టూడియోను, మ్యాస్ట్రో ఇళయరాజా సందర్శించారు. మ్యాస్ట్రోని మా ఫిర్థౌస్ స్టూడియోకి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా ప్లే చేయడానికి ఆయన అద్భుతమైన సంగీతాన్ని కంపోజ్ చేస్తారని ఆశిస్తున్నాను అంటూ ఇళయరాజాతో దిగిన ఫోటోను రెహమాన్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఇద్దరు దిగ్గజ సంగీత దర్శకుల్ని ఒక్కచోట చూసి ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రిటీలు, సింగర్స్ థ్రిల్ అవుతున్నారు. చాలామంది తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.