మహారాష్ట్రలో మరోసారి కరోనా కలవరపెడుతోంది. వరుసగా రెండు రోజులు భారీసంఖ్యలో కేసులు నమోదయ్యాయి. బుధవారం 1081 కొత్త కేసులు వెలుగుచూడగా, గురువారం 1045 మంది వైరస్ బారిన పడ్డారు. ఫిబ్రవరి తర్వాత మహారాష్ట్రలో ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. కేవలం ముంబయిలోనే 704 మందికి కరోనా సోకింది. మహారాష్ట్రలో ప్రస్తుతం 4,559 క్రియాశీల కేసులు ఉన్నాయి.