మహారాష్ట్ర మంత్రి శివసేన సీనియర్ నేత ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం నుంచి విభేదించి బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. తనతో పాటు 40 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో గోటానగర్ ప్రాంతంలోని రాడిసన్ బ్లూ హోటల్‌కు చేరుకున్నారు. అధికారం మారిన తర్వాతే రాష్ట్రానికి తిరిగి వస్తామని వాళ్లంతా చెప్తున్నారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో మాకు ఎటువంటి విభేదాలు లేవు. కానీ కాంగ్రెస్, ఎన్‌సీపీతో కలిసి ఉండటం తమకు ఇష్టం లేదని చెప్తున్నారు. దీంతో మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం పతనం కావడం ఖాయంగా కనిపిస్తోంది.