మహారాష్ట్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ సమయంలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు ఎత్తివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర హోంమంత్రి దిలీప్ డబ్ల్యూ పాటిల్ ఓ ప్రకటనలో తెలిపారు. కోవిడ్ నిబంధనలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు విద్యార్థులు, పౌరులపై ఐపీసీ సెక్షన్ 188 కింద పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నింటినీ ఉపసంహరించుకుంటారని తెలిపారు.