ముంబయిలో మహేశ్, త్రివిక్రమ్

Screengrab Instagram:namratashirodkar

మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూడో సినిమా తెరకెక్కుతోంది. ‘SSMB28’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనుల్లో చిత్రబృందం నిమగ్నమైంది. మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, మెహర్ రమేశ్, సంగీత దర్శకుడు తమన్, ఫొటోగ్రాఫర్ అవినాశ్ తదితరులు కలిసి ముంబయి వెళ్లారు. అక్కడ మధ్యాహ్న భోజనం చేశారు. ఈ విషయాన్ని నమ్రత తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. ‘ఇంత చక్కని ఇంటి భోజనంతో మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు షాజియాకు ధన్యవాదాలు’ అంటూ అందులో రాసుకొచ్చింది.

Exit mobile version