‘సర్కారు వారి పాట’ రిలీజ్ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా తాజాగా బిత్తిరి సత్తి చేసిన ఇంటర్వ్యూలో సినిమా విశేషాలను పంచుకున్నాడు. సత్తి అడిగిన సరదా ప్రశ్నలకు ఫన్నీ సమాదానాలు ఇస్తూ కామెడీ పండించాడు. మీలాగా అందంగా కనిపించాలంటే ఏం చేయాలి, ఏం తినాలి అని అడిగితే..నీకు నచ్చింది తిను కానీ పద్దతిగా తినమని చెప్పాడు. ఇక బిత్తిరి సత్తి తయ యాస, భాషలో ప్రశ్నలు అడుగుతూ మహేశ్‌ను నవ్వించే ప్రయత్నం చేశాడు. ఈ సరదా ఇంటర్వ్యూను మీరూ చూసి ఎంజాయ్ చేయండి.