‘సర్కారు వారి పాట’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరో అడవి శేష్ మహేశ్‌బాబును కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి మహేశ్ తెలివిగా సమాదానాలు చెప్పాడు. మొదటగా, నమ్రత గారు మాకు కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోతే వాయిస్ మెసేజ్‌లు, ఎస్ఎంఎస్‌లు వస్తూనే ఉంటాయి. మా పరిస్థితే ఇలా ఉంటే మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు అని అడిగాడు. దీనికి మహేశ్.. నేను ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాను లేకపోతే షూటింగ్‌లో ఉంటాను కాబట్టి, నాకు ఆ ప్రాబ్లమ్ లేదు అని చెప్పాడు. ఇక ఫ్యాన్స్ గురించి ఏదైనా చెప్పమని అడగ్గా.. నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో నాకు వీళ్లందరూ ఉన్నారు. ఎలా రుణం తీర్చుకోవాలో తెలియదు కానీ వాళ్లను సంతోషపెట్టేందుకే నేను సినిమాలు చేస్తున్నానని వెల్లడించాడు.
https://youtube.com/watch?v=99jjBBfDQSw%0A